Back to FeedQuickToday Shorts

General
Aug 5, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మళ్లీ వైసీపీ గూటికి విజయసాయిరెడ్డి..?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (VSR) తిరిగి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆయన పార్టీలో కీలక పాత్ర పోషించేందుకు పావులు కదుపుతున్నారని, దీనికి వైసీపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం వల్ల వైసీపీకి బీజేపీతో సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఈ తరుణంలో ఢిల్లీ స్థాయిలో విజయసాయిరెడ్డికి ఉన్న పరిచయాలు పార్టీకి, అలాగే బీజేపీతో సంబంధాల పునరుద్ధరణకు ఉపయోగపడతాయని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, గతంలో ఆయనను జగన్ కోటరి అని విమర్శించిన నేతలు, తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.



