Back to FeedQuickToday Shorts

International
Jul 31, 2026Short Read
12 వేదికల్లో వన్డే వరల్డ్ కప్ - ఐసీసీ కీలక ప్రకటన
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- క్రికెట్ అభిమానులకు శుభవార్త!
వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ వేదికలపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ప్రకటన చేసింది.
ఈ మెగా టోర్నీ మూడు దేశాల్లోని ఏకంగా 12 వేదికల్లో జరగనున్నట్లు ఐసీసీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించింది.దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
మ్యాచ్ల నిర్వహణ కోసం ఎంపిక చేసిన 12 స్టేడియాల్లో, దక్షిణాఫ్రికాలో అత్యధికంగా 8 వేదికలు ఉండగా, జింబాబ్వేలో 3, మరియు నమీబియాలో ఒక స్టేడియం వేదిక కానున్నాయని ఐసీసీ పేర్కొంది.మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ ప్రపంచ కప్ సమరం 2027 అక్టోబర్ 4వ తేదీన ప్రారంభమై, నవంబర్ 21వ తేదీ వరకు ఉత్కంఠభరితంగా సాగనుంది.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


