Back to FeedQuickToday Shorts

International
Sep 8, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
యుద్ధం గెలిస్తే ప్రపంచానికి శుభవార్త అంటున్న ట్రంప్!
న్యూయార్క్, సెప్టెంబర్8:
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధించిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 3 డాలర్లుగా ఉన్న గ్యాలన్ (3.78 లీటర్లు) ఆయిల్ ధర, యుద్ధం ముగిశాక 2 డాలర్ల కంటే దిగువకు చేరుతుందని ఆయన తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు.ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధ దేశంగా మారలేదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలన్నీ అతి త్వరలోనే జరగబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా ఇరాన్ పై అమెరికా సైన్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలనే యోచనలో ట్రంప్ ఉన్నట్లు అర్థమవుతోంది.



