Back to FeedQuickToday Shorts

International
Sep 13, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
బీజింగ్‌కు తిరుగు పయనమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన ముగిసింది.
నిన్న మధ్యాహ్నం భారత్‌కు చేరుకున్న ఆయన, శిఖరాగ్ర సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
అయితే, నిన్న రాత్రి ప్రధాని మోదీ ఇచ్చిన విందు కార్యక్రమానికి జిన్‌పింగ్ దూరంగా ఉన్నారు.
ఈరోజు ఉదయం మళ్లీ మోదీతో కలిసి బ్రిక్స్ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
పర్యటన పూర్తి కావడంతో రాత్రి 11.50 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్ బీజింగ్‌కు బయలుదేరి వెళ్లారు.
Tags:#International#National#Shorts




