Back to FeedQuickToday Shorts

National
Sep 2, 2026Short Read
చుక్కలు చూపిస్తున్న నిమ్మకాయలు.. కిలో రూ.200కు పైనే!
ఆంధ్రప్రదేశ్లో నిమ్మ ధరలు అమాంతం పెరిగాయి.
నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో వారం రోజుల వ్యవధిలోనే 80 కిలోల బస్తా ధర రూ.4 వేలు పెరిగి, ప్రస్తుతం రూ.16 వేలకు చేరుకుంది.
దీంతో రిటైల్ మార్కెట్లో కిలో నిమ్మకాయల ధర ఏకంగా రూ.200 పలుకుతోంది.
తగినన్ని వర్షాలు లేకపోవడం, దిగుబడి భారీగా తగ్గడంతో పాటు శ్రావణమాసం కావడం వల్ల నిమ్మకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
మీ ప్రాంతంలో కిలో నిమ్మ ధర ఎంతుందో కామెంట్ చేయండి.





