Back to FeedQuickToday Shorts

Telangana
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నాయకుల ఆస్తుల చుట్టూ రాజకీయ పోరు..?
తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య ఆస్తుల చుట్టూ రాజకీయ పోరు తీవ్రస్థాయికి చేరింది.
ఇటీవల బిఆర్ఎస్ నేతల ఆస్తులే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నాయి.
దీనికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు బిఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ (INC) నాయకులకు చెందిన ఫామ్‌హౌస్‌లు, భూములు, ఇతర ఆస్తుల వివరాలను సేకరిస్తున్న గులాబీ నేతలు, నేరుగా వారి ప్రాపర్టీల వద్దకే వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట.
వచ్చే పది రోజుల్లోగా ప్రత్యేక బస్సు యాత్ర ద్వారా వెళ్లి ఆయా ఆస్తులను ముట్టడించేందుకు వ్యూహం రచిస్తున్నారు.
ఈ నిరసన ప్రణాళికపై బిఆర్ఎస్ అధిష్టానం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Tags:#Telangana#National#Shorts




