
కామన్వెల్త్ గేమ్స్-2026లో
sadsadsad
న్యూఢిల్లీ, జూలై25
కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతా తెరిచింది. పారా పవర్‌లిఫ్టర్ జండు కుమార్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించాడు. 72.4 కిలోల బరువున్న జండు రెండో ప్రయత్నంలో 190 కిలోలు ఎత్తి పతకం ఖాయం చేసుకోగా, మూడో ప్రయత్నంలో 196 కిలోలు ఎత్తడంలో స్వల్ప తేడాతో విఫలమయ్యాడు. బీహార్‌లోని నలందా జిల్లా హర్నాత్ గ్రామానికి చెందిన జండు పుట్టుకతోనే పోలియో బారినపడ్డాడు. సాధారణ కూరగాయల వ్యాపారి కుమారుడైన అతడు ఎన్నో ఆర్థిక, శారీరక కష్టాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. తొలుత షాట్‌పుట్, డిస్కస్ త్రో అథ్లెట్‌గా కెరీర్ ప్రారంభించిన జండు, తర్వాత పవర్‌లిఫ్టింగ్ వైపు మళ్లాడు. పారాలింపిక్ కాంస్య విజేత రాజిందర్ సింగ్ రహేలు అతని ప్రతిభను గుర్తించి ఎస్ఏఐ గాంధీనగర్ కేంద్రంలో శిక్షణ కల్పించారు.





