Back to FeedQuickToday Shorts
District
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వర్షపు నీటిలో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి
తడిసిన మందుల పెట్టెలు.. ఇబ్బందుల్లో వైద్య సిబ్బంది
పెద్దవంగర సెప్టెంబర్ 24(క్విక్ టుడే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి గ్రామంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి జలమయమైంది.గురువారం ఆస్పత్రి ఆవరణలోకి వర్షపు నీరు చేరడంతో వైద్య సిబ్బంది,ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆస్పత్రిలోకి వర్షపు నీరు చేరడంతో మందుల నిల్వలు,మెడిసిన్,కాటన్ బాక్సులు తడిసిపోయినట్లు సమాచారం.వైద్య సేవలకు ఉపయోగించే సామగ్రి నీటిలో తడవడంతో నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో రోగులు,సిబ్బంది రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో వర్షపు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని,తడిసిన మందులు,వైద్య సామగ్రిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



