Back to FeedQuickToday Shorts

General
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
చారిత్రాత్మక T20 ప్రపంచకప్ విజయం ఈ రోజే : పాక్‌ను ఓడించి భారత్ సంచలనం!
భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన తొలి T20 ప్రపంచకప్ విజయానికి నేటితో 19 ఏళ్లు పూర్తయ్యాయి.
2007 సెప్టెంబర్ 24న జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 5 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.మొదట బ్యాటింగ్ చేసిన ధోనీ సేన గంభీర్ (75), రోహిత్ శర్మ (30) రాణించడంతో 157/5 పరుగులు చేసింది.
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను 19.3 ఓవర్లలో 152 పరుగులకే భారత బౌలర్లు ఆలౌట్ చేశారు.
బౌలింగ్‌లో ఆర్పి సింగ్, ఇర్ఫాన్ పఠాన్ చెరో 3 వికెట్లు, జోగిందర్ శర్మ 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.



