Back to FeedQuickToday Shorts

National
Sep 9, 2026Short Read
నిధుల కోసం కేంద్రం వద్ద అడుక్కోవద్దు.. అధికారుల తీరుపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్!
హిమాచల్‌ప్రదేశ్ అధికారుల వైఖరిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద గిన్నె పట్టుకుని అడుక్కోవాల్సిన అవసరం ఏముందని, రాష్ట్రంలోనే సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని సంప్రదించకపోతే మీరే ముందుకొచ్చి అడగాలని, చేతులు కట్టుకుని కూర్చోవడం సరికాదని వ్యాఖ్యానించారు.
రూ.1000 కోట్ల కోసం కేంద్రాన్ని అడిగేందుకు సిగ్గుపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు.
కాగా, కంగన చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కడి ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసనకు దిగాయి.





