Back to FeedQuickToday Shorts

National
Jul 24, 2026Short Read
నిరాహార దీక్ష విరమించిన వాంగ్చుక్
న్యూఢిల్లీ, జూలై 24:
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో జరిగిన చర్చల అనంతరం ఆయన దీక్షను ముగించారు. శాంతియుతంగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ప్రతీకార చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు, నీట్ పేపర్ లీక్ వంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ హామీల నేపథ్యంలోనే వాంగ్చుక్ దీక్ష విరమించినట్లు వెల్లడించారు. అయితే విద్యార్థుల హక్కులు, పారదర్శక పరీక్షల వ్యవస్థ కోసం తమ పోరాటం కొనసాగుతుందని వాంగ్చుక్ స్పష్టం చేశారు.





