Back to FeedQuickToday Shorts

National
Jul 31, 2026Short Read
నిరసనకారులపై కేసులు ఎత్తివేత.. నేరస్తులకు మాత్రం శిక్ష తప్పదు: ఢిల్లీ ప్రభుత్వం
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు మరియు ఇతరులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది.
అయితే, నేర చరిత్ర ఉన్నవారిని మాత్రం వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది.నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (NCT) పరిధిలోని పోలీసు అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ నిరసనలకు సంబంధించి ఇప్పటికే 13 FIRలు నమోదయ్యాయని, ఇప్పటివరకు జరిగిన అరెస్టులను సమీక్షించి, నేర చరిత్ర లేని వారిని విడుదల చేస్తామని ప్రభుత్వం వివరించింది.
ఈ నిర్ణయంతో నిరసనకారులకు కొంత ఊరట లభించింది.





