Back to FeedQuickToday Shorts

National
Jul 31, 2026Short Read
సినీ పరిశ్రమలో విషాదం: ప్రముఖ గాయని జమునా రాణి కన్నుమూత
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.
అలనాటి ప్రముఖ గాయని కె.
జమునా రాణి(88) బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.
ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆమె, 1946లోనే 'త్యాగయ్య' చిత్రంలో బాలనటుల కోసం తొలి పాట పాడారు.'ఎంత టక్కరి వాడు నా రాజు', 'సరదా సరదా సిగరెట్టు', 'ముక్కుమీద కోపం..
నీ ముఖానికే అందం' వంటి ఎన్నో మధురమైన పాటలతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
5 భాషల్లో 6 వేలకు పైగా పాటలు పాడిన జమునా రాణి ప్రతిభకు గుర్తింపుగా, తమిళనాడు ప్రభుత్వం ఆమెను 'అన్నాదురై పురస్కారం', 'కలైమామణి' అవార్డులతో సత్కరించింది.
ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.





