Back to FeedQuickToday Shorts

National
Sep 8, 2026Short Read
ప్రధాని మోదీ ఈవెంట్లో కలకలం: నకిలీ PMO ఐడీ, గన్తో వ్యక్తి అరెస్ట్!
ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన 'గ్లోబల్ ఫిన్టెక్' సదస్సులో భద్రతా లోపం తీవ్ర కలకలం రేపింది.
ఈవెంట్ ప్రారంభానికి ముందు నకిలీ PMO (ప్రధానమంత్రి కార్యాలయం) ఐడీ కార్డుతో లోపలికి ప్రవేశించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది సకాలంలో గుర్తించి అడ్డుకున్నారు.అతడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద తుపాకీ లభించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని రోహన్ పరేష్గా గుర్తించారు.
అతనికి డ్రోన్ టెక్నాలజీ వ్యాపారం ఉన్నట్లు తేలింది.
ప్రధాని పాల్గొనే ప్రాంగణంలోకి నకిలీ ఐడీ, గన్తో ఎందుకు వచ్చారనే కోణంలో పోలీసులు వారిని తీవ్రంగా విచారిస్తున్నారు.





