
మోదీ, అమిత్షా నిరంకుశత్వం: రేవంత్
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇండియా కూటమి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదన్నారు.
బారాఖంబ పోలీస్ స్టేషన్లో ఉన్న రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్లిన తనను కూడా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆరోపించారు.
ఓటు హక్కును హరించే చర్యలను ప్రజలు క్షమించరని అన్నారు.
ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోరాటం మాత్రమే కాదని, దేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అరెస్టులు, పోలీసుల చర్యలతో ఉద్యమాన్ని అణచలేరని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.



