Back to FeedQuickToday Shorts

Telangana
Aug 30, 2026Short Read
మంత్రి పొంగులేటిపై హరీష్ రావు ఫైర్: 22A భూముల పై ప్రశ్నల వర్షం
22A నిషేధిత భూముల వ్యవహారంలో మంత్రి పొంగులేటిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
ఆయన్ను 'పొంగులేటి కాదు..
పొంగులూటీ' అని ఎద్దేవా చేశారు.
98% భూములు తొలగిస్తే, పటాన్చెరు నియోజకవర్గంలోనే 50,565 ఎకరాలు నిషేధిత జాబితాలో ఎందుకున్నాయని ప్రశ్నించారు.
ఎలాంటి దరఖాస్తు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఆ జాబితా నుంచి ఎలా తొలగించారని నిలదీశారు.
నాయకులకో న్యాయం, ప్రజలకో న్యాయమా అని ప్రశ్నించిన హరీష్ రావు, రేవంత్ ఇల్లు తీసినట్లే ప్రజల ఇళ్లను కూడా జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అలాగే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సర్కస్ చూస్తున్నారని కూడా ఆయన విమర్శించారు.





