Back to FeedQuickToday Shorts

Telangana
Aug 9, 2026Short Read
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ: ఒక్క హైదరాబాద్‌లోనే 40 లక్షల ఓట్లు గల్లంతు?
తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే దాదాపు 44 లక్షల ఓట్లను తొలగించగా, ఇప్పుడు తెలంగాణలో కేవలం హైదరాబాద్ నగర పరిధిలోనే సుమారు 40 లక్షల ఓట్లు తొలగించబడే అవకాశముందని సమాచారం.ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన అనేకమంది ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సమర్పించకపోవడమే దీనికి ప్రధాన కారణం.
నగరంలో నివాసముంటున్న వీరిలో చాలామంది ఇక్కడ కంటే తమ స్వగ్రామాలు లేదా సొంత రాష్ట్రాల్లోనే ఓటు హక్కును కొనసాగించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు.





