
7,437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్
సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీసు, జైళ్ల శాఖల్లో పోస్టుల భర్తీ
హైదరాబాద్, జూలై29(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ పోలీసు శాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకారం సివిల్, ఏఆర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, ఎస్పీఎఫ్లో ఎస్సై 44, కానిస్టేబుల్ 1,380 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ రైటర్ 751, జైళ్ల శాఖలో 223 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్లో స్వీకరిస్తామని, షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుకు ముందు నోటిఫికేషన్లో పేర్కొన్న శారీరక, వైద్య అర్హతలను సివిల్ సర్జన్తో పరీక్షించుకోవాలని సూచించారు. ఎస్సీ అభ్యర్థులు ఉపకుల వర్గీకరణ స్పష్టంగా ఉన్న కుల ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని నియామక మండలి పేర్కొంది.




