మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారక పార్కులో విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్సింగ్ భారతదేశం గర్వించదగిన జాతిరత్నమని కొనియాడారు. పరిపాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని అన్నారు. మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వకపోవడం శోచనీయమని, ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు. పీవీ నర్సింహారావు, మన్మోహన్సింగ్ ఆలోచనల ఫలితమే సరళీకృత ఆర్థిక విధానాలని, వాటి వల్లే దేశంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఏర్పడ్డాయని తెలిపారు. మన్మోహన్సింగ్ జీవితం అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ మన్మోహన్సింగ్ను ‘ఎకనామిక్ ఫైటర్’గా అభివర్ణించారు.



