Back to FeedQuickToday Shorts

Telangana
Sep 3, 2026Short Read
హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన కొండా సురేఖ.. తదుపరి కార్యాచరణపై దృష్టి!
మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, కొండా సురేఖ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.
షోకాజ్ నోటీసుపై కాంగ్రెస్ హైకమాండ్‌కు వివరణ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్‌లతో సమావేశమై జరిగిన పరిణామాలను వివరించానని, దీనిపై వారు సానుకూలంగా స్పందించి 'చూస్తాం..
ఆలోచిస్తాం' అని చెప్పినట్లు సురేఖ తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో జరిగిన పరిణామాల నేపథ్యంలో, ఆమె నేడు తన వరంగల్ అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.





