Back to FeedQuickToday Shorts

Telangana
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వినాయక విగ్రహాల తరలింపులో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో విగ్రహాల తరలింపుపై సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
విగ్రహాలను మండపాలకు తీసుకొచ్చే ముందు ప్రయాణించే మార్గాన్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా దారిలో ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్, కరెంట్ వైర్లు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిల వంటి అడ్డంకులను ముందుగానే గమనించాలి.
ఎత్తు ఎక్కువగా ఉండే విగ్రహాలైతే..
అవసరమైన పక్షంలో విద్యుత్ శాఖ, పోలీసు అధికారులకు ముందస్తు సమాచారం అందించాలని స్పష్టం చేశారు.అలాగే, విగ్రహాలను తరలించే భారీ వాహనాల బ్రేకులు, టైర్ల కండిషన్ తనిఖీ చేసుకోవాలి.
డ్రైవర్ మద్యం సేవించి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనం నడపనివ్వకూడదని, సురక్షితంగా విగ్రహాలను తరలించి పండుగను జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు.



