Back to FeedQuickToday Shorts

Telangana
Jul 29, 2026Short Read
గూడూరులో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా
శివ్వంపేట, జులై 29 (క్విక్ టుడే న్యూస్):
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీగురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీదత్తాత్రేయ స్వామి, శ్రీసమర్థ సద్గురు షిరిడి సాయినాథ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పెద్దగోని శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలోనే తొలి దత్తపంచాయతనం నిర్మాణమే తమ లక్ష్యమని తెలిపారు. గురుపీఠం భవిష్యత్తులో ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సర్పంచ్ బ్యాగరి నర్సయ్య, గ్రామ పెద్దలు, ట్రస్ట్ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


