Back to FeedQuickToday Shorts

Telangana
Sep 8, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఎమ్మెల్సీల అరెస్ట్: కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిల అరెస్టుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చలేకే అక్రమ అరెస్టులతో డైవర్షన్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీలన్నీ అమలైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలమంతా స్వచ్ఛందంగా అరెస్టు అవుతామని సవాల్ విసిరారు.
గతంలో మహిళా ఎమ్మెల్యేలు సబితక్క, సునీతమ్మల చీరలు లాగిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా ఫేక్ కేసులతో ఎమ్మెల్సీలను అరెస్ట్ చేశారని, కాంగ్రెస్ పగటివేషాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు.



