Back to FeedQuickToday Shorts

Telangana
Sep 1, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
Loading article...

రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై వేటు వేసేందుకు అధిష్ఠానం రంగం సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, నేడు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో సమావేశం కానున్నారు.
పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై వీరు ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డిని కూడా పదవుల నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఆమెను కాపాడేందుకు కొందరు మంత్రులు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.
అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.