Back to FeedQuickToday Shorts

Telangana
Sep 15, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
తెలంగాణ రాష్ట్రంలో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
రేపు ఉదయం 8.30 గంటల వరకు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అలాగే ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Tags:#Telangana#National#Shorts





