Back to FeedQuickToday Shorts

Telangana
Aug 23, 2026Short Read
కొండా సురేఖ వ్యాఖ్యలపై పెరుగుతున్న నిరసన: క్షమాపణ కోరిన మంత్రి అడ్లూరి!
తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె చేసిన వ్యక్తిగత విమర్శల పట్ల సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్న మంత్రులు సైతం ఇప్పుడు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు.ముఖ్యంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ వివాదంపై స్పందిస్తూ, కొండా సురేఖ వెంటనే ముఖ్యమంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావులేదని, రేవంత్ రెడ్డి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలని ఆయన హితవు పలికారు.





