Back to FeedQuickToday Shorts

Telangana
Sep 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీరు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సభలోకి వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుని, చీర లాగారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీరుమున్నీరయ్యారు.
మహిళల పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమెను ఓదార్చారు.
మరోవైపు, నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది.
ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాలికి గాయమైంది.
తమ పట్ల వ్యవహరించిన తీరుపై మండిపడిన కేటీఆర్..
సీఎం రేవంత్ రెడ్డికి తగిన మూల్యం చెల్లిస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.



