Back to FeedQuickToday Shorts

Telangana
Jul 31, 2026Short Read
'ఫార్ములా ఈ' కేసులో నేడు కోర్టుకు కేటీఆర్
క్విక్ టుడే న్యూస్, జులై 31 :- ఫార్ములా ఈ-కార్ రేసు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది.
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్, ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకానున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకపక్షంగా, నిబంధనలకు విరుద్ధంగా రేసును నిర్వహించారని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరోపిస్తోంది.
దీని కారణంగా సుమారు రూ.
55 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఏసీబీ పేర్కొంది.
ఈ మేరకు దాఖలు చేసిన ఛార్జిషీట్లో కేటీఆర్‌ను ఏ1గా చేర్చింది.
ఈ కేసు విచారణలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.





