Back to FeedQuickToday Shorts

Telangana
Sep 8, 2026Short Read
రేవంత్ సర్కార్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్: 'ఇది మీ అయ్య జాగీరు కాదు!'
స్పీకర్ విషయంలో ఎమ్మెల్సీ తాతా మధు ఎలాంటి తప్పు చేయకపోయినా, కేసీఆర్ ఆదేశాల మేరకు క్షమాపణలు చెప్పారని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి అనవసరంగా రాజకీయం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
కాంగ్రెస్ గుండాలకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి మరీ కేసీఆర్ నివాసానికి పంపించారని ఆరోపించారు.ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..
‘ఇదేమీ మీ అయ్య జాగీరు కాదు’ అంటూ ఘాటుగా స్పందించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అందరికంటే ముందే కాంగ్రెస్ పార్టీకి అంతం తప్పదని హెచ్చరించారు.
దేశంలో న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకముందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.





