Back to FeedQuickToday Shorts

Telangana
Sep 7, 2026Short Read
కేసీఆర్ పాదయాత్రపై మంత్రి ఉత్తమ్ కౌంటర్: "ఇంట్లో పడుకోవడమే ఉత్తమం!"
లక్షమందితో పాదయాత్ర చేస్తానన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటనపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు.
కేసీఆర్ పాదయాత్రకు బయలుదేరితే జనం నవ్వుకుంటారని, బయటకు రాకుండా ఇంట్లోనే పడుకోవడం బెటర్ అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో ప్రబలిన నీటి సమస్యకు ఎల్నినో ప్రభావంతో పాటు కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి ఆయనే బాధ్యుడని, అక్కడికి వెళ్లేందుకు ఆయనకు ఎలాంటి నైతిక హక్కు లేదన్నారు.
గతంలో కేసీఆర్ వాడిన అనుచిత భాషనే ఇప్పుడు ఆయనపై ఉపయోగిస్తే బీఆర్ఎస్ నేతలు రచ్చ చేస్తున్నారని అసెంబ్లీ మీడియా హాల్ వేదికగా ధ్వజమెత్తారు.





