Back to FeedQuickToday Shorts

Telangana
Sep 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై భగ్గుమన్న బీఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులను మెడపట్టి గెంటేయడం, మహిళా శాసనసభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు.
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఈ దుశ్చర్యకు బాధ్యులైన ఏ ఒక్క పోలీసునూ వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే తమపై పోలీసులతో దాడి చేయించారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.
మహిళా లోకానికి ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమెతో పాటు మరో నేత సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.



