Back to FeedQuickToday Shorts

Telangana
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పాలిటెక్నిక్ కోర్సుల్లో ఎలాంటి మార్పు లేదు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పాలిటెక్నిక్ కోర్సుల విషయంలో వస్తున్న పుకార్లను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఖండించారు.
పాలిటెక్నిక్ విద్యావిధానం యథాతథంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.మూడేళ్ల వ్యవధి ఉండే ఈ డిప్లొమా కోర్సును ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సుగా కుదిస్తారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు.
అలాగే, అకడమిక్ హోదాలోనూ ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారన్న ఆరోపణలు నూటికి నూరు శాతం అబద్ధమని ఆయన కొట్టిపారేశారు.
మాసబ్‌ట్యాంక్‌లో పాలిటెక్నిక్ చదివిన హరీష్ రావు కూడా ఈ విషయంలో అసత్యాలు ప్రచారం చేయడం శోచనీయమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.



