Back to FeedQuickToday Shorts

Telangana
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఏపీ మీసేవ కేంద్రాల్లో ఆధార్ తప్పనిసరి కాదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వ సేవలు పొందేందుకు ఆధార్ అథెంటికేషన్ కేవలం ఆప్షనల్ (ఐచ్ఛికం) మాత్రమేనని స్పష్టం చేసింది.
ప్రజలు తమ ఆధార్ వివరాలు ఇవ్వకపోయినా సరే, 246 రకాల సేవలు మరియు పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాకరించకూడదని తేల్చిచెప్పింది.ఒకవేళ ఈ-కేవైసీ కోసం కస్టమర్ల అనుమతితో ఆధార్ వివరాలు తీసుకుంటే, వాటిని ఎందుకు తీసుకుంటున్నారు, ఎక్కడ భద్రపరుస్తారో వారికి స్పష్టంగా తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు 'స్వర్ణ' శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Tags:#Telangana#National#Shorts





