
గాంధీ భవన్ ముట్టడించిన కాంగ్రెస్ శ్రేణులు
ఇంచార్జి మార్పు కోరుతూ కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
శివ్వంపేట, జులై 18 (క్విక్ టు డే న్యూస్):
నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డిని మార్చాలని డిమాండ్ చేస్తూ శివ్వంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లోని గాంధీ భవన్ ఎదుట నిరసన చేపట్టారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలంటే నాయకత్వంలో మార్పు అవసరమని వారు పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని, వారి అభిప్రాయాలను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీని సమన్వయంతో ముందుకు నడిపించే నాయకత్వాన్ని నియమించాలని డిమాండ్ చేస్తూ అధిష్ఠానానికి వినతిపత్రం అందజేశారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


