
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు
హైదరాబాద్, జూలై17(క్విక్ టుడే న్యూస్):
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. జూలై 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలను ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో జూలై 14న విచారణకు హాజరుకావాలని ఆయనకు సమాచారం ఇచ్చినప్పటికీ, స్పందన రాలేదని పేర్కొంది. దీంతో వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఫెడరేషన్ హెచ్చరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణ అందే వరకు జానీ మాస్టర్‌తో పాటు డ్యాన్సర్ల అసోసియేషన్‌కు అనుబంధ సంఘాలు సహకరించవద్దని సూచనలు జారీ చేసింది. ఇదే సందర్భంగా డ్యాన్సర్ల అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరుపై కూడా ఫిల్మ్ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. డ్యాన్సర్ల ఉపాధికి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆమెకు సూచించింది.





