
18, 19 తేదీల్లో తెల్లవారుజాము వరకూ బార్లు ఓపెన్
ఫుట్బాల్ మ్యాచ్ల సందర్భంగా బార్ల పనివేళల పొడిగింపు
హైదరాబాద్, జూలై17(క్విక్ టుడే న్యూస్):
ఫుట్బాల్ అభిమానుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 18, 19 తేదీల్లో జరిగే అంతర్జాతీయ ఫుట్బాల్ కీలక మ్యాచ్లను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ నగర పరిధిలోని లైసెన్స్ పొందిన బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు, మైక్రోబ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, జూలై 18, 19 తేదీల్లో బార్లు తెల్లవారుజామున 4:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే, జూలై 19న జరిగే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జూలై 19–20 మధ్య రాత్రి 3:00 గంటల వరకు మద్యం విక్రయాలు నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. ఈ వెసులుబాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని లైసెన్స్ పొందిన బార్లు, క్లబ్బులు, టూరిజం బార్లు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.




