Back to FeedQuickToday Shorts

Telangana
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ!
పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కరీంనగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అటు ఏపీలోని మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Tags:#Telangana#National#Shorts





