Back to FeedQuickToday Shorts

Telangana
Jul 29, 2026Short Read
సామాన్యులకు షాక్ : భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు
క్విక్ టుడే, తెలంగాణ :- ఆగస్టు నెల నుంచి సామాన్యులకు మరో షాక్ తగలనుంది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల కారణంగా రిఫ్రిజిరేటర్లు, టీవీలు, దుస్తులు, ప్యాసింజర్ వెహికల్స్, ప్యాకేజ్డ్ టీ, హెయిర్ ఆయిల్ వంటి పలు రకాల ఉత్పత్తుల ధరలు 6-8% పెరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్లపై 4-6%, నిత్యావసరాలపై 3-5% వరకు ధరల పెంపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే, మారుతి సుజుకీ (మోడల్‌ను బట్టి రూ.30 వేల వరకు), హోండా కార్స్ వంటి ఆటోమొబైల్ కంపెనీల వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెరుగుదల వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టనుంది.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


