Back to FeedQuickToday Shorts

Telangana
Jul 29, 2026Short Read
తెలుగు రాష్ట్రాల్లో నేడు దంచికొట్టనున్న భారీ వర్షాలు!
క్విక్ టుడే, జులై 29:- తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.అటు ఏపీలోనూ అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.





