Back to FeedQuickToday Shorts

Telangana
Jul 29, 2026Short Read
టాలీవుడ్ అగ్ర హీరోలకు గాయాల గండం.. ఆందోళనలో అభిమానులు!
క్విక్ టుడే న్యూస్, జులై 29 :- టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతుండటం అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి ఇటీవల ముంబైలో సర్జరీ జరిగింది.
'NBK 111' యాక్షన్ సన్నివేశాల్లో గాయపడిన బాలకృష్ణ మోకాలికి, అలాగే 'పెద్ది' మూవీ సెట్స్‌లో గాయపడిన రామ్ చరణ్ మణికట్టుకు కూడా ఆపరేషన్లు జరిగాయి.
తాజాగా 'డ్రాగన్' సినిమా షూటింగ్లో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సైతం తీవ్ర గాయమై విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఒకేసారి ఈ స్టార్ హీరోలంతా ఆసుపత్రుల పాలుకావడంతో సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్' ట్రెండ్ అవుతోంది.
సినిమా షూటింగ్స్ లో ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో హీరోల భద్రతపై మరింత శ్రద్ధ వహించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.





