Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 8, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అభివృద్ధికి, ఓట్లకు ముడిపెట్టలేమన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓట్ల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధి చేసినంత మాత్రాన ఓట్లు వస్తాయనుకోవడం పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు.
మంచాలమండ అనే మారుమూల గ్రామాన్ని ఉదాహరణగా చెబుతూ, అక్కడ రోడ్లు లేకపోయినా 500 ఇళ్లు, చెక్ డ్యామ్ లు కట్టించానని, అయినా ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదని గుర్తుచేసుకున్నారు.
ఓట్లు అనేవి కేవలం అభివృద్ధిపైనే కాకుండా, మానవ సంబంధాలు, స్థానిక పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయని ఆయన విశ్లేషించారు.
కొంతమంది స్థానిక నేతలు అవినీతికి పాల్పడితే, తిరిగి వాళ్లకే పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో ప్రజలు ఓట్లు వేయలేదని ఒక కార్యక్రమంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.



