ఆడబిడ్డలంటే అపారమైన గౌరవం నాకుంది..
ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి..
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 07 క్విక్ టుడే న్యూస్):
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతీరు గురించి తెలుసుకునేందుకు ఆర్టీసీ బస్సెక్కిన నేపథ్యంలో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసిన ప్రచారంపై ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి స్పందించారు. బస్సు ప్రయాణం గురించి తన బిడ్డల్లాంటి విద్యార్థినులతో ప్రేమగా మాట్లాడితే... దానిని వక్రీకరించటం సరికాదన్నారు. కాలేజ్ జోన్ అయిన ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉచిత బస్సు ప్రయాణం ఎక్కువగా ఉపయోగించుకుంటారని... దీని అమలుతీరును పరిశీలించేందుకే నిన్న బొంగ్లూర్ ఓఆర్ఆర్ వద్ద ఆర్టీసీ బస్సెక్కినట్లు చెప్పారు. తనను చూసి విద్యార్థులందరూ వచ్చి మాట్లాడే క్రమంలో తన బిడ్డల మాదిరిగా ప్రేమతో వారితో ముచ్చటించినట్లు చెప్పారు. సర్కిల్ వద్ద మలుపు తిరిగే క్రమంలో కదులుతున్న బస్సులో చిత్రీకరించిన దృశ్యాలను బీఆర్ఎస్ నేతలు తమ పెయిడ్ బ్యాచ్‌తో సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేయించారన్నారు. తన ఇంటి ఆడబిడ్డల్లా మహిళల్ని గౌరవిస్తానన్న మల్రెడ్డి... బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలిని ప్రజలు గమనించాలని చెప్పారు.



