Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 7, 2026Short Read
స్వాతంత్ర్య దినోత్సవానికి ముస్తాబవుతున్న అమరావతి: రాయపూడిలో భారీ ఏర్పాట్లు!
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఘనంగా సిద్ధమవుతోంది.
వేడుకల నిర్వహణ కోసం రాయపూడిలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.వర్షం వచ్చినా ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు 15 వేల టన్నుల గ్రావెల్ తో మైదానాన్ని చదును చేస్తున్నారు.
దీనికి తోడుగా వాటర్ ప్రూఫ్ షీట్లను కూడా సిద్ధం చేస్తున్నారు.
ఈ 30 ఎకరాలను విభజించి, 10 ఎకరాల్లో సందర్శకుల కోసం గ్యాలరీలు, మరో 10 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం, మిగిలిన 10 ఎకరాల్లో భద్రతా బలగాల పరేడ్ కోసం మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం రక్షక దళాలు రిహార్సల్స్ నిర్వహిస్తూ పరేడ్ కు సన్నద్ధమవుతున్నాయి.





