
చెంగిచెర్లలో ఆగస్టు 16న బోనాలు
చెంగిచెర్ల, జూలై19(క్విక్ టుడే న్యూస్):
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్-10 పరిధిలోని చెంగిచెర్లలో ఆగస్టు 16న రోజున బోనాల వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం చెంగిచెర్లలో డివిజన్ పరిధిలో గ్రామ పెద్దలు, మాజీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కొత్త చెందర్ గౌడ్,బింగి జంగయ్య యాదవ్, బోడుప్పల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త రవి గౌడ్,మాజీ క-ఆఫక్షన్ సభ్యులు రంగ బ్రాహ్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివశంకర్, కొత్త శ్రీశైలం గౌడ్, కొత్త గోపాల్ గౌడ్,కొత్త విక్రమ్ గౌడ్, కుర్రి మహేష్, వివిధ కుల సంఘాల పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, కాలనీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు తదితరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు డివిజన్ పరిధిలోని అమ్మవార్లకు బోనాలు నిర్వహించేందుకు ఏకగ్రీవంగా ముహూర్తం ఖరారు చేశారు.





