
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఘనంగా గణపతి పూజ
శేరిలింగంపల్లి, సెప్టెంబర్14 (క్విక్ టుడే న్యూస్):
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణపతి పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించబడింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఐఏఎస్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించి, జోన్ పరిధిలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో పాటు కార్యాలయ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.





