
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ, సెప్టెంబర్ 12 (క్విక్ టుడే న్యూస్):
నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద శాంతియుత మహాధర్నా నిర్వహించారు. అనంతరం 13 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు.CMR శాతం నిర్ణయించే ముందు టెస్ట్ మిల్లింగ్ నిర్వహించాలని, రబీ సీజన్లో బాయిల్డ్ రైస్‌ను మాత్రమే స్వీకరించాలని, పాత ఖాళీ బస్తాలకు ధర నిర్ణయించాలని, బస్తాల రిపేర్, మెయింటెనెన్స్ చార్జీలు చెల్లించాలని కోరారు. అలాగే పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, CMR ఒప్పందాన్ని ఇరు వర్గాలకు అనుకూలంగా రూపొందించాలని, 200 HP వరకు LT విద్యుత్ కేటగిరీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి నారాయణ, జనరల్ సెక్రటరీ రేపాల భద్రాద్రి రాములు తదితరులు పాల్గొన్నారు.





