Back to FeedQuickToday Shorts

District
Oct 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా అవగాహన
జనగామ, అక్టోబర్ 24 (క్విక్ టుడే న్యూస్):
పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్ మరియు జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జనగామ పట్టణంలో కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. కళాకారులు నాటికలు, పాటల రూపంలో పోలీసు అమరవీరుల ధైర్యసాహసాలు, అంకితభావం, త్యాగాలను వివరించి, సమాజానికి వారు అందించిన అమూల్యమైన సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.



