Back to FeedQuickToday Shorts

District
Aug 25, 2026Short Read
జనగామ జిల్లాలో కోతుల బీభత్సం
వృద్ధురాలి పై దాడి, తీవ్ర గాయాలు
జనగామ, ఆగస్టు 24 (క్విక్ టుడే న్యూస్):
జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామానికి చెందిన బాలగుని పద్మ (60) అనే వృద్దురాలు తన ఇంటి ఆరుబయట పనిచేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కోతుల బెడదతో గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు, అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.





