Back to FeedQuickToday Shorts

District
Aug 25, 2026Short Read
గుండెపోటుతో పెద్ద రాంచర్ల సర్పంచ్
భౌతికకాయానికి నివాళులర్పించిన డాక్టర్ లక్ష్మీనారాయణ
జనగామ, ఆగస్టు 24 (క్విక్ టుడే న్యూస్):
పెద్ద రాంచర్ల సర్పంచ్ వల్లాల మల్లేశం గుండెపోటుతో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం తెలుసుకున్న వైటిడిఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.





