Back to FeedQuickToday Shorts

General
Oct 5, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తూప్రాన్‌లో శ్వేత విప్లవానికి నాంది .. రూ.400 కోట్లతో అమూల్ డెయిరీ ప్లాంట్
తెలంగాణలో శ్వేత విప్లవం 2.0ను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి జి.
కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా తూప్రాన్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న అమూల్ అత్యాధునిక డెయిరీ ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేశారు.
18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ప్లాంట్‌లో పరిసర ప్రాంతాల రైతుల నుంచి సేకరించిన పాలను ప్రాసెస్ చేసి పాలు, పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, నెయ్యి, ఐస్‌క్రీమ్ వంటి ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు చెప్పారు.
దీంతో రైతులకు మెరుగైన ధరతోపాటు మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
పశుపోషణను అదనపు ఆదాయ వనరుగా మార్చుకోవాలని సూచించారు.
2029 నాటికి దేశవ్యాప్తంగా 75 వేల కొత్త పాడి సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.



